తెలంగాణ ఇంజనీరింగ్‌లో 27 వేల మందికి సీట్లు

0
140

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్‌ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. కొత్తగా 13,206 మందికి సీట్లు లభించగా, తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేలమందికిపైగా సీట్లను కేటాయించింది.

సీట్లు పొందిన విద్యార్థులు అలాట్‌మెంట్‌లెటర్లను   https://tseamcet.nic.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 52వేలమందికి సీట్లను కేటాయించినా, 38 వేల మందే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,02,615 మంది ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనవారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా వెరిఫికేషన్‌కు హాజరైనవారు 4,594 మంది ఉన్నారు.

17,876 సీట్లు ఖాళీ..
ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌–డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు ఉండగా, అందు లో 51,345 మందికి సీట్లను (74.18%) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు ఉన్నాయి. అందులో 51,157 సీట్ల (77.93%)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటా యించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి