డీఆర్ఎస్‌లో తిరుగులేని ధోనీ.. కుల్దీప్‌కి వికెట్ గిఫ్ట్

0
107

డీఆర్ఎస్‌లో తిరుగులేని ధోనీ.. కుల్దీప్‌కి వికెట్ గిఫ్ట్
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. తొలి వన్డేలోనూ మ్యాజిక్ చేశాడు. పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ను కుల్దీప్ దెబ్బతీశాడు. 11 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్ రెండో బంతికే దూకుడు మీదున్న జాసన్ రాయ్ (35 బంతుల్లో 38)ను ఈ మణికట్టు స్పిన్నర్ బోల్తా కొట్టించాడు.

కుల్దీప్ విసిరిన తొలి బంతిని స్వీప్ షాట్ ఆడి రెండు పరుగులు తీసిన రాయ్.. రెండో బంతిని కూడా స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించాడు. రాయ్ స్వీప్ షాట్లు ఆడటాన్ని గమనించిన కోహ్లి లెగ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచాడు. దీంతో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించిన రాయ్.. కోహ్లి-కుల్దీప్ ఉచ్చులో చిక్కాడు. ఉమేష్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

13 ఓవర్లో తొలి బంతికే కుల్దీప్ రూట్‌ (3)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ ఐదో బంతికి బెయిర్‌స్టోను కూడా ఎల్బీగా అవుట్ చేశాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ధోనీ సూచనతో రివ్యూ కోరిన కోహ్లి విజయం సాధించాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో (38) అవుటవడంతో ఇంగ్లాండ్ 9 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది. V

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి