విజయ్-త్రిష మెస్మరైజ్ చేశారే..

0
328


ఒకప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్లందరితో సినిమాలు చేసిన కథానాయిక త్రిష. ఐతే కొన్నేళ్ల కిందటే ఆమె హవాకు తెరపడింది. విజయ్.. అజిత్.. సూర్య లాంటి బడా స్టార్లు ఆమెను పక్కన పెట్టేశారు. అలాగని త్రిషకు అవకాశాలేమీ ఆగిపోలేదు. మీడియం రేంజి హీరోలతో సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తోనూ బిజీగా ఉంటోంది. ఇప్పుడామె విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో ఒక వెరైటీ సినిమా చేస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. 96.

దీని టీజర్ తాజాగా లాంచ్ చేశారు. అందులో ఇటు విజయ్.. అటు త్రిష తమదైన స్క్రీన్ ప్రెజెన్స్.. నటనతో కట్టిపడేశారు. ఈ టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం దృశ్యాలు.. నేపథ్య సంగీతంతోనే లాగించేశారు. కానీ ప్రతి షాట్ కూడా ఇందులో ప్రత్యేకంగా కనిపించింది. పొయెటిగ్గా సాగిన టీజర్.. ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. విజయ్ ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతను ముందు చాలా రఫ్ లుక్ లో వయసు మీద పడ్డ వాడిలా కనిపించాడు. త్రిష ఒక ట్రెడిషనల్ అమ్మాయిలా ఉంది. తక్కువ మేకప్ తో సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా త్రిషను చూపిస్తే ఎంత అందంగా ఉంటుందో ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాలే ఉదాహరణ. ‘96’లోనూ ఆమె అలాగే కనిపిస్తోంది. ముందు స్నేహితులుగా మొదలై.. ఆ తర్వాత ప్రేమలో పడే జంటలా కనిపిస్తున్నారు విజయ్-త్రిష. టీజర్ చివర్లో త్రిష ఏడుపు చూస్తే సినిమా ఎమోషనల్ గానూ సాగేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. నందగోపాల్ నిర్మించాడు. గోవింద్ మీనన్ సంగీతాన్నందించాడు. దర్శకుడికిది తొలి సినిమా. అయినా తనదైన ముద్ర చూపించినట్లున్నాడు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష చేతిలో దీంతో కలిపి అరడజను దాకా సినిమాలు ఉండటం విశేషం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి