రౌడీని విచారిస్తే.. హీరో మర్డర్ ప్లాన్ చెప్పాడు

0
145


ఒక రౌడీని పట్టుకునేందుకు పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నాడు. చివరకు అతగాడిని పట్టుకునేందుకు కాల్పులు సైతం జరపాల్పి వచ్చింది. పోలీసులు శ్రమ ఫలించి సదరు రౌడీ చిక్కాడు. కాల్పుల గాయాలతో ఆసుపత్రిలో చేరిన అతడు.. కోలుకున్నాక పోలీసులు విచారణ షురూ చేశారు. ఆ టైంలో సదరు రౌడీ చెప్పిన మాటలు షాకింగ్ గా మారాయి.

సదరు రౌడీ ప్లాన్ కానీ సక్సెస్ అయి ఉంటే ఒక ప్రముఖ హీరో మర్డర్ అయిపోయి ఉండేవాడు. ఇంతకీ ఆ రౌడీ ఎవరు?  అతను చంపాలనుకున్న సినీ హీరో ఎవరన్న విషయంలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన రౌడీ సైకిల్ రవి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కన్నడ సినీ హీరో యశ్ ను మర్డర్ చేయటానికి తాను కుట్ర చేసినట్లుగా వెల్లడించాడు. దీనికి ప్లాన్ చేసినా.. వర్క్ వుట్ కాలేదని వెల్లడించటంతో పోలీసులు విస్తుపోయారు.

రెండేళ్ల క్రితం తనను హత్య చేయాలన్న ఆలోచనలో కొందరు ఉన్నట్లు సినీ హీరో యశ్.. సినీ నిర్మాత జయణ్ణలు బెంగళూరు పోలీసు కమిషనర్ కు కంప్లైంట్ చేశారు.అప్పటి నుంచి నగరంలోని రౌడీల మీద పోలీసులు దృష్టి సారించారు. పలువురు రౌడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. సైకిల్ రవి.. త్యాగరాజనగర కోదండరామ అనే ఇద్దరు రౌడీలు మాత్రం పోలీసులకు దొర్కుండా తప్పించుకున్నారు.

తాజాగా సైకిల్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసే సమయంలో కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. గాయాలతో పోలీసులకు దొరికిపోయాడు. కోదండరామ ఆచూకీ ఇప్పటికి తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గాయపడిన సైకిల్ రవిని విచారించగా.. సినీ హీరో యశ్ ను చంపేందుకు ప్లాన్ చేశామని.. ఒక సినీ నిర్మాతతో అతనికున్న గొడవతో హత్య చేయాలని భావించినట్లు చెప్పారు. అయితే.. ప్లాన్ చేశామే కానీ అమలు వరకూ విషయం వెల్లలేదన్నారు.

ఈ మాటలు సంచలనంగా మారాయి. దీనిపై స్పందించిన బెంగళూరు పోలీసు కమిషనర్.. ఇదేమీ పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదని.. ఇదతా పాత కథేనని చెప్పటం గమనార్హం. అయితే.. సైకిల్ రవి 20 సిమ్ కార్డులతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడేవాడన్న విషయం విచారణలో బయటకు రావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తనను హత్య చేయటానికి కుట్ర పన్నిన ఉదంతం బయటకు రావటంపై స్పందించిన యశ్.. ఇది చిన్న విషయమని.. దీని గురించి గతంలోనే తాను పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. మొత్తంగా ఒక రౌడీ ఒక సినీ నటుడ్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారన్న విషయం శాండిల్ వుడ్ను ఉలిక్కిపడేలా చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి