అభివృద్ధి పనులకు శ్రీకారం

0
128


ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్‌ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్‌.కె పాండే మాట్లాడారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి