ప్రజాసంకల్పయాత్రతో చంద్రబాబుకు వణుకు

0
116

ప్రొద్దుటూరు కల్చరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి చేపట్టిన  ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న జనాదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వెన్నులో వణుకు పుడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రకార్యదర్శి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఆయన ఆధ్వర్యంలో 5 వాహనాల్లో 26 మంది వైఎస్సార్‌సీపీ నాయకులతో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం కాకినాడకు తరలి వెళ్లారు. ఈ సందర్భగా నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర రోజురోజుకు ప్రభంజనంగా మారి జనాదరణ పొందుతోందన్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని  ముఖ్యమంత్రిగా గెలిపించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు అందుకోవాలని భావిస్తున్నారన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు తరలివెళ్లిన వారిలో వీరపునాయునిపల్లె మండలానికి చెందిన అలిదెన మాజీ సర్పంచ్‌ పి.వాసుదేవరెడ్డి, డీసీసీ మాజీ డైరెక్టర్‌ కీర్తిపల్లె వెంకటరామిరెడ్డి, నాయకులు గంగిరెడ్డి పల్లె భాస్కర్‌రెడ్డి, కొమ్మద్ది నాగిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గంగిరెడ్డిపల్లె రవి, మొయిళ్ల చెరువు సర్పంచ్‌ వెంకటరెడ్డి, ఉరుటూరు సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి, మిట్టపల్లె సర్పంచ్‌ ప్రతాప్‌  తదితరులు ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి