లండన్: సౌతాఫ్రికా టెన్నిస్ ప్లేయర్ కెవిన్ అండర్సన్ వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అండర్సన్ సెమీస్‌లోనూ హోరాహోరీ పోరును ప్రదర్శించాడు. అమెరికా ప్లేయర్ జాన్ ఇస్నర్తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అండర్సన్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ ఆరు గంటల 35 నిమిషాల పాటు సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో అండర్సన్ 7-6, 6-7, 6-7, 6-4, 26-24 స్కోర్‌తో గెలుచుకున్నాడు. ఒక్క చివరి సెట్ రెండు గంటల 50 నిమిషాల పాటు సాగడం విశేషం. మెన్స్ ఫైనల్లో జోకోవిచ్ లేదా నాదల్‌తో అండర్సన్ తలపడనున్నాడు. జోకోవిచ్, నాదల్ మధ్య జరిగిన రెండవ సెమీస్‌ను శుక్రవారం మధ్యలో ఆపేశారు. ఆ టైమ్‌లో జోకోవిచ్ రెండు సెట్ల ఆధిక్యంలో ఉన్నాడు.