సిరీస్‌పై భారత్ గురి

0
125

-నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. -కుల్దీప్‌పై ఇంగ్లిష్ జట్టు ప్రత్యేక దృష్టి లండన్: వాళ్ల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో కష్టమేనన్న విశ్లేషకుల మాటలు తప్పని నిరూపిస్తూ యూకే పర్యటనలో భారత్ జట్టు మరో సిరీస్‌పై దృష్టిపెట్టింది. చైనామన్ కుల్దీప్ స్పిన్ కమాల్ నుంచి ఇంగ్లండ్ బయటపడితే తప్పా.. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాను నిలువరించే సత్తా ఆతిథ్య జట్టుకు లేదనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే రెండో వన్డేలో మోర్గాన్‌సేన పుంజుకుంటుందా..? టీ20 సిరీస్ మాదిరిగా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందా..? లేక షరా మామూలుగానే ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను వదిలేసుకుంటుందా..? అన్నది ఆసక్తికరం..! ఇక విరాట్‌సేన విషయానికొస్తే.. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు తమ స్థానాలకు న్యాయం చేస్తుండటంతో మరోసారి తుది జట్టు ఎంపిక కత్తిమీద సామే అయ్యింది. అయినప్పటికీ ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ప్రయోగాలేమైనా చేస్తారా..? రిజర్వ్‌కు అవకాశం ఇస్తారా.. ? అన్నది వేచి చూడాల్సిన అంశం..!

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి