సెప్టెంబర్‌లో సీఎం టీ20 క్రికెట్ కప్

0
157


క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడానికి చీఫ్ మినిస్టర్ టీ20 కప్ నిర్వహిస్తున్నామని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏమ్‌ఆర్ చౌదరి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హెల్ప్‌ఏజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 25 నుంచి ఆక్టోబర్ 7 వరకు సీఎం టీ20 కప్ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ హెల్ప్‌ఏజ్ సంస్థ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని, గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నీలు ఉపయోగపడుతాయన్నారు. మొత్తం 31 జిల్లాల నుంచి 22 టీమ్‌లతో ఈ టోర్నీని 13 రోజుల పాటు నిర్వహిస్తామని, ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా టీమ్‌కు కూడా అవకాశమిస్తామని తెలిపా రు. సీఎం టీ20 కప్‌లో విజేతలకు రూ.2లక్షల 50 వేలు, రన్నరప్‌కు లక్షా50వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష నగదు బహుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో సాట్స్ చైర్మన్‌తో పాటు టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ప్రేమ్‌రాజ్, హెల్ప్‌ఏజ్ ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు స్వప్నా రెడ్డి, మమతా గుప్తా పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి