మనసుల్ని పడేస్తున్న జోడీ

0
116


పడి పడి లేచే మనసు అంటూ హృదయాల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది శర్వానంద్.. సాయిపల్లవి జోడీ.  ఈ కాంబినేషనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికితోడు  హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రేమకథల్ని చక్కగా తీస్తుంటాడు హను. ఆ విషయం అందాల రాక్షసి – కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతోనే రుజువైంది. అందుకే `పడి పడి లేచే మనసు`పైనే అందరి దృష్టీ.

తాజాగా ఈ చిత్రంలోని కొత్త స్టిల్ బయటికొచ్చింది. అందులో సాయిపల్లవి – శర్వానంద్ చేతిలో చెయ్యేసుకొని కనిపిస్తున్నారు. ఈ స్టిల్ చూడగానే కెమిస్ట్రీ ఏ రేంజిలో పండుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే కలకత్తాలో 70 రోజులపాటు చిత్రీకరణ జరిపారు. తదుపరి నేపాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు.దాంతో సినిమా పూర్తవుతుందట. ఈ సినిమా కోసం శర్వానంద్ తన హెయిర్ స్టైల్ ని మార్చేసి – కొత్తగా కనిపిస్తున్నాడు. సాయిపల్లవి కూడా ఇదివరకటి చిత్రాలకంటే అందంగా కనిపిస్తోంది. మరి ఈ జోడీ  ఏ రేంజిలో ప్రేక్షకుల మనసుల్ని పడేస్తుందో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి