బార్బర్ గా నటిస్తోన్న టాయిలెట్ హీరో!

0
113


బాలీవుడ్ హీరోలలో అక్షయ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. చిన్న హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అక్షయ్….అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా మారాడు. బాలీవుడ్ లో ఖాన్ త్రయం హవాను తట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. విలక్షణ కథలతో పాటు పాత్రలను ఎంచుకొని…వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. సామాజిక సందేశం ఉన్న చిత్రాలను కూడా కమర్షియల్ హిట్ లు చేసిన ఘనత అక్షయ్ కే సొంతం. టాయిలెట్ వంటి సందేశాత్మక చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన అక్షయ్…ఆ తర్వాత ప్యాడ్ మ్యాన్ తో మరోసారి ఆ మార్క్ ను చేరుకున్నాడు. తర్వాత దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతోన్న మరో విలక్షణ చిత్రం`గోల్డ్ ` సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన స్టార్ ఇమేజ్ ను పక్కకు పెట్టి….అటువంటి చిత్రాలలో నటిస్తోన్న అక్షయ్….ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. తాజాగా ఓ బార్బర్ పాత్రలో నటించేందుకు అక్షయ్ అంగీకరించి…తన విలక్షణతను మరోసారి చాటుకున్నాడు అక్షయ్.

గత పదేళ్లలో అక్షయ్ కుమార్….బాలీవుడ్ లో చాలా ప్రయోగాత్మక సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ హిట్ లు సాధిస్తున్నాడు. అదే తరహాలో ఇపుడు మరో వైవిధ్యమైన సినిమాలో అంతకన్నా వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు. `హౌస్ ఫుల్` సిరీస్ లో రాబోతోన్న నాలుగో చిత్రంలో అక్షయ్ ….ఓ బార్బర్ పాత్రలో నటించబోతున్నాడు. లండన్లో స్థిరపడ్డ ఇండియన్ బార్బర్ గా `హౌస్ ఫుల్ -4` లో అక్షయ్ నటించబోతున్నాడు. ఇప్పటి నుంచే ఆ పాత్ర కోసం అక్షయ్ కసరత్తులు ప్రారంభించాడు. తెల్లటి జుట్టు.. గడ్డంతో స్టైల్ గా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న అక్షయ్ పిక్ …సోషల్ మీడియాలో వైరల్ అయింది. హౌస్ఫుల్ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. సాజిద్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘హౌస్ ఫుల్-4’ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి