శ్రీకాకుళం: ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్‌ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్‌ వద్ద ఇరువై లారీలు, 2 జేసీబీలు చిక్కుకుపోయాయి. లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన లారీలు, జేసీబీల డ్రైవర్లతోపాటు 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు.

0
155

24 గంటలు టైమిస్తున్నా : మురళీ మోహన్ కోడలు హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం హైదరాబాదులో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా నిరూపిస్తే తనపై ఏ కేసుకైనా సిద్ధమని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆధారాలు ఉంటేనే జగన్ ఆరోపణలు చేయాలని చెప్పారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి