జగజ్జేత ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచకప్ రెండోసారి కైవసం

0
93


మాస్కో: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్..ఒకవైపు ఫేవరెట్ ఫ్రాన్స్ ..మరోవైపు అభిమానులంతా గెలువాలని కోరుకున్న క్రొయేషియా.. ఉత్కంఠ తారాస్థాయికి చేరిన వేళ..ప్రతి అభిమాని మునివేళ్లపై నిలబడి మ్యాచ్‌ను తిలకించిన సమయాన.. రెండుజట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగింది.. రెండు మదగజాలు తలపడినట్లుగా..రెండు కొదమసింహాలు పోట్లాడినట్లుగా రెండ్లు జట్లూ అసమాన ఆటతీరుతో ఉర్రూతలూగించాయి.. ఒక్కక్షణం చాలు మ్యాచ్ గమనం మారేందుకు..ఒక్క క్షణం చాలు మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకునేందుకు.. క్రొయేషియాను ఇంతకాలం గెలిపించిన సూపర్ ఫార్వర్డ్స్ మాంజికిచ్, పెరిసిచ్ పొరపాట్లు ఫ్రాన్స్‌కు లాభించాయి.. రెండు పొరపాట్లు ఫ్రాన్స్‌కు రెండుగోల్స్ అందించాయి.. క్రొయేషియాను ఫైనల్ చేర్చిన హీరోలే విలన్లుగా మారిన వేళ.. సెల్ఫ్‌గోల్‌తో మాంజికిచ్, బంతిని చేతితో అడ్డుకుని పెరిసిచ్ చేసిన తప్పు ఫ్రాన్స్‌కు వరమైంది. దీంతో ఫ్రాన్స్ ఖాతాలో రెండుగోల్స్ నమోదు కావడంతో ఆ జట్టు చెలరేగింది.. క్రొయేషియా తరఫున పెరిసిచ్, మాంజికిచ్ చెరో గోల్ కొట్టినా దూకుడుతో మెరిసిన ఫ్రాన్స్‌ను నిలువరించలేకపోయారు.. పోగ్బా, ఎంబాప్పే, గ్రీజ్‌మన్ గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను జగజ్జేతగా నిలిపారు. గ్రీజ్‌మన్ గోల్ కొట్టగా ఇంతవరకు ఓటమి ఎరుగని ఫ్రాన్స్ జట్టు రికార్డు నిలబెట్టుకోగా సంబురాలు మొదలయ్యాయి. ఫైనల్లో 4-2 గోల్స్ విజయంతో ఫిఫా ప్రపంచకప్ విజేతగా ఫ్రాన్స్ నిలవగా.. పోరాడి ఓడిన క్రొయేషియా సాకర్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి