లార్డ్స్‌లో లవ్ ప్రపోజల్!

0
92

లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. స్టేడియంలోని ప్రేక్షకులందరూ ఫోర్లు, సిక్సర్ల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యువకుడు మాత్రం తన ప్రేయసి ముందు ప్రేమ ప్రతిపాదనను ఉంచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో జరిగిన ఈ మధురమైన ఘటన గ్యాలరీలోని ప్రేక్షకులతో పాటు వ్యాఖ్యాతలను సైతం మంత్రముగ్దుల్ని చేసింది. ఈ ఓవర్‌లో చాహల్ నో బాల్ వేయడంతో అంపైర్ ఫ్రీ హిట్ ఇచ్చాడు. అప్పటివరకు ప్రశాంతంగా మ్యాచ్ చూస్తున్న ఆ యువకుడు ఉన్నఫలంగా లేచి జేబులో నుంచి ఉంగరం తీసి మోకాళ్లపై కూర్చొని తన ప్రియురాలికి ప్రేమ ప్రతిపాదన చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్కై స్పోర్ట్స్ చానల్ తన కెమేరాలో బంధించి డెసిషన్ పెండింగ్ అంటూ బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించింది. అనుకోని పరిణామానికి కాస్త ఆశ్చర్యానికి లోనైన ఆ అమ్మాయి సంతోషంతో ప్రేమను అంగీకరించింది. లైవ్‌లో దీనిని చూసిన కామెంటేటర్ డేవిడ్ ల్యాయిడ్.. అమ్మాయి ప్రేమను అంగీకరించిందంటూ గట్టిగా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది కూడా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి ప్రేమ ప్రతిపాదనలు చాలా వచ్చాయని, ఇక్కడి గాలిలో నిత్యం ప్రేమ ఉంటుందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి