ఫైనల్లో 13 మంది బాక్సర్లు

0
129

 

న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోవ్ వొజోడినా యూత్ టోర్నీలో భారత బాక్సర్ల పంచ్ అదురుతున్నది. ఓవరాల్‌గా ఆరుగురు మహిళలతో కలిసి 13 మంది బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. 51 కేజీ సెమీస్‌లో జ్యోతి గులియా 5-0తో లుబోవా మకీవా (రష్యా)పై గెలిచింది. పురుషుల సెమీస్‌లో అకాశ్ కుమార్ (56 కేజీ) 5-0తో జాన్ క్యాసీ (స్కాట్లాండ్)పై, అంకిత్ (60 కేజీ) 5-1తో అలెక్స్ జాకబ్ (హంగేరి)పై, ఆకాశ్ (64 కేజీ) 5-0తో డానియెల్ పిట్రోస్కీ (పోలాండ్)పై గెలువగా, విజయదీప్ (69 కేజీ) మిలాన్ రాంకోవిచ్ (సెర్బియా) ఏకపక్షంగా విజేతగా ప్రకటించారు. మిడిల్ వెయిట్‌లో నితిన్ కుమార్ (75 కేజీ) 5-0తో ఫిలిప్ జినిక్ (సెర్బియా)ను ఓడించాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి