మను, అనుమోల్‌కు పసిడి

0
131

న్యూఢిల్లీ: చెక్‌లో జరుగుతున్న షూటింగ్ హోప్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత షూటర్లు మను బాకెర్-అన్‌మోల్ జైన్‌లతో కూడిన జట్టుకు స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 763 పాయింట్లు సాధించిన భారత ద్వయం.. ఫైనల్లో 476.9 పాయింట్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన దేవాన్షి రానా-సౌరభ్ చౌదురి 1.2 పాయింట్లు వెనుకబడింది. శ్రేయాస్ అగర్వాల్-హ్రిదయ్ హజారికా ద్వయానికి కాంస్యం దక్కింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ 11 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి