ఆరెక్స్ దర్శకుడికి ఆఫర్ల వెల్లువ!

0
142


ఇప్పుడున్న క్రియేటివ్ యూత్ దర్శకులు సక్సెస్ కి కొత్త అర్థం చెబుతున్నారు. స్టార్ హీరోలు లేకుండా బడా బడ్జెట్ అవసరం రానివ్వకుండా  సంచలన విజయాలు సాధిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. గత ఏడాది అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగా ఇది రుజువు చేయగా ఇప్పుడు ఆ బాధ్యతను ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి నిర్వర్తించాడు. గత మూడు రోజులుగా ఇతని ఫోన్ నాన్ స్టాప్ ఇన్ కమింగ్ తో మోగిపోతోంది. అభినందనల కోసం కాదు తమ బ్యానర్ లో సినిమాకు అడ్వాన్స్ తీసుకోమని నిర్మాతల ఫోన్ కాల్స్ వల్ల. కార్తికేయ లాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న హీరోతోనే ఇంత ఇంటెన్సిటీతో తీయగలిగినప్పుడు సీనియారిటీ ఉన్న హీరోలతో ఇంకా బాగా తీయొచ్చు అనే అంచనా కలగడం సహజం. ఆరెక్స్ 100 బాగా బడ్జెట్ పరిమితుల్లో తీసినది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా. ఆ విషయంలో స్వేచ్ఛ ఇస్తే ఇంకెంత బాగా అవుట్ ఫుట్ రాబడుతాడో అని అజయ్ భూపతి కోసం నిర్మాతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి