ఇంటి వద్దకే 100 రకాల ప్రభుత్వ సేవలు

0
90

న్యూఢిల్లీ : డ్రైవింగ్‌ లైసెన్స్‌, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్‌ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట. ఇక మీదట ఇలాంటి 100 రకాల ప్రజా సేవలను ఢిల్లీ ప్రభుత్వం ఇంటి వద్దనే అందించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి ఈ సేవలన్నింటిన్నీ ఇంటి వద్దనే అందించడం ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటి కోసం అదనంగా 50 రూపాయల ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, విజయవంతంగా పూర్తయిన ప్రతి ఒక్క లావాదేవీకి ‘  ఫెసిలిటేషన్‌ ఫీజు’ కింద సిటిజన్ల నుంచి 50 రూపాయలు ఛార్జ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి వర్గం ప్రకటించింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఈ సమస్యను తీర్చడానికి ఢిల్లీ సర్కారు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా ఈ వినూత్న సౌకర్యాన్ని ప్రారంభించబోతుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి