‘హిందూ-ముస్లిం లొల్లి.. ఆ జట్టును చూసి నేర్చుకోండి’

0
106

హైదరాబాద్‌ : దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం గొడవల పట్ల టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘కేవలం 50 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతోంది. కానీ 130 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం హిందూ-ముస్లింలు అనుకుంటూ గొడవపడుతున్నాం’ అని ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి