సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజేషన్‌ చేయాలన్నా

0
113


తూర్పుగోదావరి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని, వారి వేతనాలు పెంచాలని ఆరోగ్యశాఖ సిబ్బంది వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డిని  కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పెదపూడి మండలం పెద్దాడలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను సోమవారం ఏఎన్‌ఎంలు కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌ ఏఎన్‌ఎంలకు ఒకే రకంగా వేతనాలు లేవన్నారు. ఒకే కేడర్‌ ఉద్యోగులకు ఒకే వేతనం అమలు చేయాలని వై.సుమతి, బి.శ్రీదేవి, ఎస్‌కే బషీర్‌బీ, బి.లక్ష్మి, వై.నరసింహ, కె.రాజేశ్వరి, ఎన్‌.అన్నపూర్ణ తదితరులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి