నేడు బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం

0
300

హైదరాబాద్‌ : ఆషాఢమాసం బోనాల జాతరను పురస్కరించుకొని ‘భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ’ ఆధ్వర్యంలో మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో నగరంలోని ఏడు దేవాలయాలకు చెందిన అమ్మవార్లకు తొలిసారిగా బంగారు బోనాన్ని సమర్పిస్తున్నామన్నారు.

ఈ నెల 15వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. ఈ నెల 20న జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లికి, 24 న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, 26న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయం, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించనున్నామన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి