హిందీ ‘బిగ్ బాస్’ షోలో హిందీ ‘బిగ్ బాస్’ షోలో ….???????

0
121


హిందీ ‘బిగ్ బాస్’ షోలో కొత్త సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికి హీరో హీరోయిన్లు.. దర్శక నిర్మాతలు రావడం ఎప్పట్నుంచో నడుస్తున్న సంప్రదాయమే. ఐతే తాజాగా ఈ షోలో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్. ఈయన తమిళంలో ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాను హోస్ట్ గా ఉంటూ.. తనే తన సినిమాను ఏం ప్రమోట్ చేసుకుంటాం అనుకున్నారేమో.. ఆయన ఇందుకోసం హిందీ ‘బిగ్ బాస్’ హౌస్ కు వెళ్లారు. ‘విశ్వరూపం-2’ విశేషాల్ని పంచుకున్నారు.

హిందీలో ‘బిగ్ బాస్’ణు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ వీళ్లిద్దరూ కలిసి భలే సందడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఇంకా ఆ ఎపిసోడ్ ప్రసారం కాలేదు. ఈ వీకెండ్లో సల్మాన్-కమల్ కలిసి సందడి చేసిన ఎపిసోడ్ వస్తుంది. బహుశా కమల్ తెలుగు ‘బిగ్ బాస్’ హౌస్ కు కూడా వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. కమల్ ప్రతి సినిమా తెలుగులో పెద్ద స్థాయిలోనే విడుదలవుతుంది.

‘విశ్వరూపం-2’ మీద కూడా తెలుగులో మంచి అంచనాలే ఉన్నాయి. తన సినిమాల్ని బాధ్యతగా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేయడానికి వస్తుంటాడు కమల్. పైగా ఇది ఆయన సొంత సినిమా. దీని కోసం ఐదేళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. చివరికి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి ఈ చిత్రాన్ని తన చేతికి తీసుకుని మిగతా పని పూర్తి చేశాడు కమల్. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి