ప్రతి మహిళ జీవితంలో కొన్ని సర్దుబాట్లు తప్పవు – మేఘన్‌ మార్కేల్‌

0
133

ప్రస్తుతం మేఘన్‌ మార్కల్‌ కూడా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారంట. నలుగురిలో చిరునవ్వుతో కనిపించే మేఘన్‌ తన మనసులో అపారమైన బాధను భరిస్తున్నారంట. ఆమె మోముపై ఉన్న చిరునవ్వు నిజం కాదంట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయంగా మేఘన్‌ తండ్రే. ఒకప్పటి ఈ నటి ప్రిన్స్‌ హారీని వివాహం చేసుకుని రాజకుటుంబంలో అడుగుపెట్టారు. ఇన్నాళ్లు సాధారణ జీవితం గడిపిన మేఘన్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాయల్‌ ఫ్యామిలీలో ఒదిగిపోవడం అంటే కష్టమే. కొత్త వాతవారణం, కొత్త మనుషులు అన్నింటికి మించి ఇన్నాళ్లు అందరిలానే చేసిన కొన్ని పనులను కూడా ప్రత్యేక పద్దతిలో చేయాల్సి రావడం కాస్తా కష్టమే. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు మేఘన్‌ మార్కల్‌. ఇప్పటికే పలు సందర్భాల్లో రాయల్‌ ఫ్యామిలీ నియమాలను మర్చిపోతూ మీడియా వారికి పని కల్పిస్తున్నారు.

దాంతో సామన్యులు కూడా పాపం మేఘన్‌కు రాజకుటుంబం బరువు బాధ్యతలు మోయడం ఇబ్బందిగా ఉన్నట్లుంది అనుకుంటున్నారు. ఇలా అనుకునే వారిలో మేఘన్‌ మార్కేల్‌ తండ్రి కూడా ఉన్నారు. ఈ విషయం గురించి థామస్‌ ‘ఇప్పుడు నా కూతురు ప్రారంభించిన కొత్త జీవితం ఆమెను భయపెడుతుందనుకుంటున్నాను. ఆమె కళ్లల్లో, మొహంలో, చివరికి ఆమె నవ్వులో కూడా ఆ భయం నాకు స్పష్టంగా తెలుస్తుంది’ అని తెలిపారు. మేఘన్‌ మార్కల్‌ బహిరంగ సమావేశాలకు హాజరయిన ప్రతిసారి ఆమె మొము మీద చిరునవ్వు ఉంటుంది.

కానీ ఆమె తండ్రి థామస్‌ మాత్రం అది నిజం చిరునవ్వు కాదంటున్నారు. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. అంతేకాక ‘మేఘన్‌కు వివాహం అయిన నాటి నుంచి నేటి వరకూ నేము ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఆమెకు ఫోన్‌ చేసిన తను ఫోన్‌ ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి