స్టార్ హోటల్స్‌లో ఉంటూ, ఆభరణాలు తెప్పించుకొని దోపిడీ: లగ్జరీ దొంగ అరెస్ట్

0
86


హైదరాబాద్: స్టార్ హోటల్స్‌లో విడిది చేస్తూ లగ్జరీ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని నార్త్ జోన్ పోలీసుల మంగళవారం నాడు అరెస్టు చేశారు. నిందితుడిని అండమాన్‌కు చెందిన రావ్‌గా గుర్తించారు. అండమాన్ నుంచి వచ్చి స్టార్ హోటల్స్‌లో మకాం వేస్తూ ప్రముఖ జ్యువెల్లరీ షాపులకు ఫోన్ చేసి ఆభరణాలు కొంటానని బుకాయించి వారిని బోల్తా కొట్టిస్తాడు. అభరణాలు తీసుకొని తాను ఉంటున్న స్టార్ హోటల్‌కు రావాలని చెబుతాడు. వారు ఆభరణాలు తీసుకు వచ్చాక బోల్తా కొట్టించి, వాటిని దోచుకుంటాడు. ఇలా స్టార్ హోటళ్లలో ఉంటూ పలు నగరాల్లో లగ్జరీగా దొంగతనాలకు పాల్పడ్డాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి