అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్

0
129

ఫ్రాన్స్‌లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా‌లోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి బంగారు పతకాన్ని అందించిన ఈ స్టార్‌ అథ్లెట్.. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌ ఫైనల్లో జావెలిన్‌ను రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్‌ త్రోయర్‌ ఆండ్రియన్ 81.48 మీటర్లతో రజత పతకాన్ని గెలుపొందగా.. లితివేనియా అథ్లెట్‌ ఈడిస్ 79.31 మీటర్లతో కాంస్య పతకం గెలుపొందాడు. అయితే అనూహ్యంగా.. 2012 ఒలింపిక్ ఛాంపియన్‌ వాల్కాట్‌ 78.26 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి