8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించిన – ఇంగ్లండ్‌

0
101


రీస్ నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (108 బంతుల్లో 88; 9×6, 1×6), జో రూట్ (120 బంతుల్లో 100; 10×4) చెలరేగడంతో లీడ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఇంకో 33 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించడంతో 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ రెండు పరుగులకే వెనుదిరిగాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన రోహిత్ 18 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 71; 8×4).. శిఖర్ ధావన్ (49 బంతుల్లో 44; 7×4) స్కోరు బోర్డును నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. జోరు పెంచుతున్న దశలో బెన్ స్టోక్స్ డైరెక్ట్ త్రోతో ధావన్‌ను రనౌట్ చేశాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి