రాణించిన కోహ్లి.. ఇంగ్లాండ్ లక్ష్యం 257 పరుగులు

0
111

లీడ్స్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇంగ్లాండ్‌కు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్ (44), విరాట్ కోహ్లి (71), ధోనీ (42) రాణించడంతోపాటు.. చివర్లో టెయిలెండర్లు మెరవడంతో ఫర్వాలేదనిపించే స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 18 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసిన హిట్ మ్యాన్ విల్లే బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి