మహేష్ హీరోయిన్ కు లక్కీ చాన్స్

0
114


కైరా అద్వానీ దశ తిరిగిపోయింది. ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింద్ ధోని జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ చిత్రంలో నటించిన కైరాకి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. అందులో చూసిన తర్వాతే దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం ఇచ్చారు. భరత్ అనే నేను రిలీజ్ కావడం.. అందులో కైరా అద్భుతంగా నటించడం చూశాక.. నిర్మాత డీవీవీ దానయ్య తను తాజాగా రాంచరణ్ తో తీస్తున్న చిత్రంలోనూ అవకాశం ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ లో ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి