జ్యుయలరీ కంపెనీని ఆ నటి మోసం చేసిందా?

0
93

అదేం అదృష్టమో కానీ.. కొందరు సెలబ్రిటీలు.. నటీనటులు నిత్యం వార్తల్లో దర్శనమిస్తుంటారు. వారి తప్పున్నా.. లేకున్నా.. వారి పేర్లు జనాల నోళ్లల్లో వార్తల రూపంలో నానుతూ లైమ్ లైట్ లో ఉంటారు. అయితే.. ఈ వార్తలన్నీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ కావటమే వారికొచ్చే చిక్కంతా.

ఎవరిదాకానో ఎందుకు బిగ్ బాస్ (హిందీ) 11 మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ ముచ్చటే చూడండి. ఆమె తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆమెకు ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా వారు ఆమె గురించి ఏదో ఒకటి రాయకుండా ఉండలేరని అప్పుడప్పుడు ఆమె సటైర్లు వేస్తుంటారు కూడా. తాజాగా ఒక తప్పుడు వార్త ఆమె పైన న్యూస్ ఛానళ్లు వార్తలు వేస్తున్నాయని చెబుతున్నారు.

ఇంతకీ ఆ నెగిటివ్ న్యూస్ ఏమంటే.. ఒక బంగారు ఆభరణాల కంపెనీ యాడ్లో నటించిన హీనా ఖాన్.. షూట్ అయ్యాక కంపెనీకి ఇవ్వాల్సిన ఆభరణాలు ఇవ్వకుండా తనతో పాటు తీసుకెళ్లారన్నది ఆరోపణ. దీనిపై కంపెనీ ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనిపై కాసింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు హీనాఖాన్. మీడియాను సోషల్ మీడియా సాక్షిగా ఎక్కెసం చేసుకున్న ఆమె.. ఆభరణాల కంపెనీ తన ఇంటికి లీగల్ నోటీసులు పంపకుండా మీడియా హౌస్ లకు ఎందుకు పంపినట్లు? అంటూ ఎటకారం ఆడేశారు. తన శత్రువులు తనను క్షమించాలని.. ఈసారికి వారి ఐడియా వర్క్ వుట్ కాలేదని.. కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుందన్న ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ట్విట్టర్ లో ఆమె ఈ రకంగా పోస్టు చేస్తే.. ఛానళ్లు మాత్రం ఆమె ఇంటికి వెళ్లిన లీగల్ నోటీస్ ఆధారాన్ని విజువల్స్ గా టెలికాస్ట్ చేయటం గమనార్హం. మరి.. ఈ ఇష్యూ గురించి హీనా ఖాన్ కంటే కూడా సదరు ఆభరణాల కంపెనీ రియాక్ట్ అయితే కానీ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చేట్లుగా లేదుగా?

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి