‘ఆరోగ్యలక్ష్మి’తో గర్భిణులకు మేలు

0
98

ఎంజీఎం వరంగల్‌ : ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంతో గర్భిణులకు మేలు జరుగుతుందని డీఎంహెచ్‌ఓ హరీష్‌ రాజు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ అదేశాలతో ‘ఆరోగ్య లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా అర్బన్‌ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం గర్బిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించేందుకు వైద్యాధికారులతో ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు.

బుధవారం  జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అ«ధికారి శైలజ.. వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ హరీశ్‌రాజు మాట్లాడుతూ ‘ఆరోగ్య లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని  పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో అందిస్తారన్నారు.

గర్భిణులకు పరీక్షలు, కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం వారికి భోజనం, పాలు, గుడ్లు అందిం చ నున్నట్లు తెలిపారు.  పాలు, గుడ్లను దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి పీహెచ్‌íసీకి అందించడం జరుగుతుందన్నారు.ల సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లలితాదేవి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, కృష్ణారావు, డెమో అశోక్‌రెడ్డి, సీడీపీఓ మాధురి, సులోచన, రమణమూర్తి వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి