బీబీపేటలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్నబీజేపీ నాయకులు

0
145

బీబీపేట నిజామాబాద్‌ : బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుదవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసినందుకు గాను సీఎం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన కిషన్‌ రెడ్డి, రామచంద్రరావు ప్రగతి భవన్‌కు వెళుతుండగా అరెస్టు చేశారు.

ఇందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. అలాగే పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌ ఆముదాల నరేందర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు రంజిత్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు దుంప నర్సింలు, ఉపాధ్యక్షుడు మురళి గౌడ్, టౌన్‌ అధ్యక్షుడు రాములు గౌడ్, కార్యకర్తలు శివ, ప్రసాద్, నాగరాజు, వంశీలాల్, దేవరాజ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి