అథ్లెట్స్‌ ఎంపికను పున:పరిశీలించండి..!

0
118

అథ్లెట్స్‌ ఎంపికను పున:పరిశీలించండి..!
ఆసియా గేమ్స్‌ కోసం ఎంపిక చేసిన అథ్లెట్స్ జాబితాను పున:పరిశీలించాల్సిందిగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ (ఐఓఏ)కి తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ‌ లేఖ రాసింది. ఇండోనేషియాలోని జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆసియా గేమ్స్‌ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఐఓఏ 524 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించింది. కానీ.. ఈ జట్టు ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో తాజాగా మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రతిభ ఉన్న అథ్లెట్స్‌ ఎంపిక కోసం అవసరమైతే మార్చి 10, 2015లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనలను సైతం సడలించే వెసులబాటుని కల్పించింది.

జూలై 3న ఇండియన్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ (ఐఓఏ) 524 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించగా.. అందులో 277 మంది పురుషులు, 247 మంది మహిళా అథ్లెట్స్‌ ఉన్నారు. మొత్తం 36 విభాగాల్లో భారత్ అథ్లెట్స్ పోటీ పడనుండగా.. అధికారులతో కలిసి మొత్తం 2,370 మందితో కూడిన జాబితాను ఐఓఏ మంత్రిత్వ శాఖకి ఈ నెల ఆరంభంలో పంపింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి