బిగ్ బాస్ లీక్స్: ఈ వారం సామ్రాట్.?

0
100


బిగ్ బాస్.. అన్ని దేశాల్లో అన్ని భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యి ఉర్రూతలూగిస్తోంది. బిగ్ బాస్ షోకు జనాలు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం ‘సస్పెన్స్’. ఎప్పుడు ఏం జరుగుతుంది.? ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.? ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారనే దానిపైనే షో రేటింగ్ ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడా సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి. కొన్ని చర్యలు బిగ్ బాస్ పై ఆసక్తిని పోగొడుతున్నాయి. టెలివిజన్ లో టెలీకాస్ట్ అవ్వకముందే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ముందురోజే తెలిసిపోతోంది. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక ఇప్పుడు ఏదీ దాచలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిదే బిగ్ బాస్ టీం ను కలవరపెడుతోందట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి