బ్రేకింగ్: బిగ్ బాస్ లోకి యాంకర్ ప్రదీప్..?

0
103


బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న షో.. ఇప్పుడందరూ దీని గురించే చర్చిస్తున్నారు. హోస్ట్ నాని ప్రతి శని – ఆదివారాలు సందడి చేసి హైప్ పెంచుతుండగా.. మిగతా వారాల్లో వెరైటీ టాస్క్ లతో ఇంటిసభ్యులు అలరిస్తున్నారు. వారం వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.. వైల్డ్ కార్డు ద్వారా ఎవరైనా ఇంట్లోకి వస్తారా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టీం తాజాగా అందరికీ షాకిచ్చింది.

తెలుగు బుల్లి తెర హాట్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్ బాస్ హౌస్ లోకి ఈ రాత్రి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన ప్రోమో వైరల్ గా మారింది.  యాంకర్ ప్రదీప్ సందర్భానుసారం కామెడీ పంచులు విసరడంలో దిట్ట. తెలుగు యాంకర్లలోకెల్ల అత్యంత చురుకైన వాడు.. ప్రదీప్ చేస్తున్న షోలన్నీ టాప్ రేటింగులతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ మేనియాను క్యాష్ చేసుకొని మరింత హైప్ పెంచడానికి అతడిని తాజాగా బిగ్ బాస్ ఇంట్లోకి పంపించి బిగ్ బాస్ టీం అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ప్రస్తుతం ప్రదీప్ ఫుల్ బిజీగా ఉన్నారు.  తను చేస్తున్న బుల్లితెర షోలన్నింటిని ఆపివేసి బిగ్ బాస్ లోకి వచ్చాడా.? లేక నాలుగైదు రోజులు ఉండి పోతాడా అన్నది వేచి చూడాలి. అయితే బట్టలతో సహా బిగ్ బాస్ లోకి వచ్చిన ప్రదీప్ ను చూసి ఇంటిసభ్యులంతా షాక్ అయ్యారు.

బిగ్ బాస్ ఇంటిలో మొన్నీ మధ్య బెడ్ మంచాలను మార్చారు. ఒకరి కోసం ప్రత్యేక బెడ్ వేశారు.  దీంతో ఏదో వైల్డ్ కార్డు ఎంట్రీ వస్తుందని బిగ్ బాస్ ఇంటిసభ్యులంతా ఆసక్తిగా ఉన్నారు. తాజాగా  ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగానే వారంతా ఆశ్చర్యపోయారు.   ప్రదీప్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే తన మార్కు కామెడీతో చెలరేగిపోయారు. ఒక్కో ఇంటిసభ్యుడు చేసిన సరదా పనులను వారికి వివరిస్తూ కామెడీ చేస్తూ అలరించాడు. వారు చేసిన మంచు పనులు చెప్పి కన్నీళ్లు పెట్టించాడు.

ఇక చివర్లో ప్రదీప్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను బిగ్ బాస్ ఇంటినుంచి పోకుండా ఉండాలంటే మీరంతా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాడు. దీన్ని బట్టి ప్రదీప్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడానికే వచ్చాడని.. కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాడని అర్థమవుతోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి