అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌

0
107

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించారు. గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. గతంలో కాంగ్రెస్‌పై చేసిన విమర్శలే ఇప్పుడు బీజేపీపైనా చేయటం విశేషం. ముందుగా భరత్‌ అనే నేను చిత్ర కథతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించిన.. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్లారు.  ‘ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు. మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది. లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది. మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు. విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆంధ్రపదేశ్‌కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. అయితే గల్లాజయ్‌ దేవ్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.  వెంటనే మేడమ్‌ స్పీకర్‌ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది. …

‘ఎన్నికలకు ముందు మోదీ ఏపీకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. తెలుగు తల్లిని కాంగ్రెస్‌ రెండు ముక్కలు చేసిందని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. తల్లిని చంపి బిడ్డను  బయటకు తీశారని మోదీ అన్నారు. హోదా ఇస్తానని ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ముడిపెడుతున్నారు. మోదీ మోసం చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నెల్లూరు, విశాఖ, తిరుపతి సభల్లో మోదీ ఇచ్చిన హామీలకు విలువ లేదా?..

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి