మళ్లీ ఫ్రెష్ లుక్‌లోకి వచ్చేసిన ధోనీ..!

0
107

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ ఫ్రెష్‌ లుక్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌తో ఈనెల ఆరంభం నుంచి మొదలైన టీ20, వన్డే సిరీస్‌ల్లో నెరసిన గడ్డంతో కనిపించిన ధోనీ.. అక్కడ నుంచి భారత్‌కి వచ్చేముందు నీట్‌గా సేవ్ చేసేశాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ జట్టు టెస్టు సిరీస్‌ ఆడనుండగా.. 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న భారత్.. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న విషయం తెలిసింది. ముఖ్యంగా.. ధోనీ పేలవ బ్యాటింగ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వన్డే సిరీస్‌లో ఈ మాజీ కెప్టెన్ ఎక్కువసేపు క్రీజులో ఉన్నా.. చేసిన పరుగులు తక్కువే కావడంతో.. ఇక అతను రిటైర్మెంట్ తీసుకోవాలంటూ విమర్శలు వచ్చాయి. వీటికి తోడు.. మూడో వన్డే ముగిసిన తర్వాత అంపైర్లను అడిగి ధోనీ బంతి తీసుకోవడంతో అతను వీడ్కోలు చెప్పబోతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ.. రవిశాస్త్రి ఆ వీడ్కోలు వార్తల్ని కొట్టిపారేశాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి