హీరోయిన్ మమతా మోహన్ దాస్ …క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు

0
96

హాలీవుడ్ లో హార్వీ వీన్ స్టీన్ ఉదంతంతో క్యాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో మొదలైన # మీ టూ ఉద్యమం నుంచి….టాలీవుడ్ లో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన వరకు క్యాస్టింగ్ కౌచ్ లోని భిన్న పార్శ్వాలను బట్టబయలు చేశాయి. ప్రత్యేకించి శ్రీరెడ్డి ఉదంతం తర్వాత..చాలామంది టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ నటీమణులు – హీరోయిన్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ పై తమ అభిప్రాయాలను – చేదు అనుభవాలను వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపుగా అన్ని సినీ ఇండస్ట్రీలు…ఆ మాటకొస్తే దాదాపుగా మహిళలు పనిచేసే ప్రతిచోటా…`కాస్టింగ్ కౌచ్` వ్యవహారం ఏదో ఒక రూపంలో వేళ్లూనుకొని పోయింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ మమతా మోహన్ దాస్ …క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళతో వేరే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే….అందులో ఆమె ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంటుందని మమత షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి