ట్రంప్‌ను ఇడియట్‌ అంటున్న గూగుల్‌

0
170

శాన్ ఫ్రాన్సిస్కొ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, దిగ్గజ సర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం గూగుల్‌కు అలవాటే. అలానే ఈ సారి మరో పెద్ద తప్పిదం చేసి వార్తల్లో నిలిచింది ఈ సర్చ్‌ ఇంజన్‌. ప్రస్తుతం గూగుల్‌లో ‘ఇడియట్’ అని టైప్ చేసి… ఇమేజెస్ కోసం వెతికితే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది. అయితే దీనిలో గూగుల్‌ తప్పిదం ఏం లేదంట.

ట్రంప్‌పై ద్వేషం ఉన్నవారు గూగుల్‌ అల్గారిథమ్‌లో ‘ఇడియట్‌’ అనే పదం దగ్గర ట్రంప్ ఫొటోను యాడ్‌ చేశారంట. అందువల్లే ‘ఇడియట్‌’ అని టైప్‌ చేసి ఫోటోల కోసం వెతికితే ట్రంప్‌ ఫోటోలు దర్శనమిస్తున్నాయంట. ఎవరో ట్రంప్ వ్యతిరేకులే కావాలని ఈ పని చేశారని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్‌ శత్రువులు ఈ విధంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములుగా ఉన్నారని తెల్పింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి