నిజమైన దోషులెవరో తేలిపోయింది – పురందేశ్వరి

0
126

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం ఆమె స్పందించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. ఆ కాంగ్రెస్‌ మద్దతుతోనే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్‌లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిటీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్‌ ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. ఏపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనలో సీఎం చంద్రబాబుకు భాగం ఉందని ఆరోపించారు. ఏపీకి ఏమడిగినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న పార్లమెంట్‌లో బీజేపీపై టీడీపీ అబద్ధాలు చెప్పిందన్నారు. దుగరాజుపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కడప స్టీల్‌ ప్లాంట్‌ జాప్యం చంద్రబాబు వల్ల కాదా అని ఆమె ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్‌ కచ్చితంగా ఇస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడలేందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి