పిడియాట్రిక్‌ ఐసీయూలో అరుదైన వ్యాధితో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ( బాలిక)

0
102


(విజయవాడ తూర్పు): గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం దోసపాలెంకు చెందిన సంధ్యారాణికి పుట్టుకతో ఎలాంటి గుండెజబ్బు లేదు. మూడేళ్ల వయస్సులో వచ్చిన రుమాటిక్‌ ఫీవర్‌ కారణంగా అరుదైన గుండెజబ్బుకు గురైంది. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి వచ్చిన జబ్బును గుర్తించలేక పోయారు. వయస్సు పెరిగినా ఎదుగుదల లేక పోవడం, కాళ్లు చేతులు సన్నగా అయిపోవడంతో గతంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. బాలిక అరుదైన గుండెజబ్బుతో బాధపడుతోందని, తమ వద్ద వైద్యం లేదని చేతులెత్తేసారు. అనంతరం ప్రవేటు ఆస్పత్రిలో  పిడియాట్రిక్‌ కార్డియాలజీ వైద్యుడికి చూపించగా, ప్రస్తుతం ఆపరేషన్‌ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. చేసేది లేక ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా, పిడియాట్రిక్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి