పేంచికల్‌పేటలో ప్రత్యక్షమైన వింత పాము

0
110

కమాన్‌పూర్‌ : మండలంలోని పేంచికల్‌పేట గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహపురం కాలనీలో కొన్ని రోజులుగా విషపాముల సంచారంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పునరావాస కాలనీని సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రెండు రోజుల కిత్రం కాలనీలోకి వచ్చిన కొండ చిలువను చంపితే మరల నేడు రక్త పింజర రావడంతో భయాందోళనలో జీవిస్తున్నారు. వెంటనే సింగరేణి అధికారులు స్పందించి విష సర్పాల నుంచి కాపాడేందుకు కావాల్సిన మౌలిక వసతులు కాలనీలో కల్పించాలని వేడుకుంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి