రామగుండంలో విమానాశ్రయం ……?????????

0
97

పాలకుర్తి(రామగుండం) పెద్దపల్లి :   జిల్లాలో విమానం ఎగరానుంది. బసంత్‌నగర్‌ కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఐదుజిల్లాలో విమానశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఏవియేషన్‌ అధికారులతో హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రామగుండంతో పాటు వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల సహకారం తీసుకుని సర్వేప్రక్రియ వేగవంత చేయాలని మంత్రి అధికారులను కోరారు. దీంతో బసంత్‌నగర్‌లో నూతన విమానాశ్రయం ఏర్పాటు అంశానికి బలం చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాలు ఎగరనున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి