పేపర్ ప్రేమ బాగుందే…?????

0
110


మాస్ సినిమాలతో రచ్చ చేసే దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్న పేపర్ బాయ్ టీజర్ విడుదలైంది. ఎక్కువ హంగామా లేకుండా సాఫ్ట్ గా అనిపించే స్టోరీ లైన్ తో ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. తాను ఇష్టపడిన అమ్మాయి కోసం పేపర్ వేస్తూ ఓ ఇంటి వంక రోజు చూసే అబ్బాయికి ఓ పెద్దింటి అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా దర్శకుడు జయశంకర్ దీన్ని సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు టీజర్ కట్ చేసారు. బ్రతకడం కోసం పేపర్లు వేస్తూ భవిష్యత్తు కోసం బిటెక్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండే హీరో పాత్రలో సంతోష్ శోభన్ ఫ్రెష్ గా ఉన్నాడు. యూత్ హీరోల ట్రెండ్ గా మారిన గెడ్డంతోనే శోభన్ ఇందులో కనిపిస్తున్నాడు. దీనికి కథ రచన సంపత్ నందినే. విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉన్న పేపర్ బాయ్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది. రియా సుమన్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా మరో పాత్ర తాన్యా హోప్ కూడా నటిస్తోంది.  భీమ్స్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి