డేట్స్ క్లాష్.. మెగా హీరో వైదొలిగాడు..

0
104

డేట్స్  క్లాష్ కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. తమిళ అగ్ర హీరో సూర్యతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నాడు.  ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు.  ప్రస్తుతం అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సంజీవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’కిది రీమేక్. మధుర శ్రీధర్ రెడ్డి – యాష్ రంగినేని నిర్మాతలు.. ఈ సినిమా డేట్స్ క్లాష్ కారణంగా సూర్య సినిమాను వదులుకున్నానని శిరీష్ పేర్కొన్నాడు. నాకు అవకాశం ఇచ్చిన హీరో సూర్య – దర్శకుడు కేవీ ఆనంద్ – లైకా ప్రొడక్షన్స్ కు కృతజ్ఞతలు అని చెప్పాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి