అదిరిపోయే ట్విస్ట్‌: రాసలీలలపై మరో సాక్ష్యం!

0
130

వాషింగ్టన్‌: ట్రంప్‌.. తన మాజీ అటార్నీ మైకేల్‌ కోహెన్‌తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్‌ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్‌ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్‌ కుదుర్చుకోవాలని కోహెన్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్‌ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్‌ బదులిచ్చినట్లు క్లిప్‌లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్‌ టవర్‌లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్‌ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్‌పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ ఏజెంట్లు కోహెన్‌ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి