సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ఊరట

0
91

 న్యూఢిల్లీ : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో చిదంబరంను ఈడీ జులై 10 వరకూ అరెస్ట్‌ చేయరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం పటియాలా హౌస్‌ కోర్టు ఆగస్ట్‌ 7 వరకూ పొడిగించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం తాజాగా అప్పీల్‌ చేసుకున్నారు.

జులై 10న ఈ కేసులో ఈడీ కోర్టుకు సమగ్రంగా బదులిస్తూ చిదంబరం గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ముందస్తు బెయిల్‌ జారీ చేస్తే కేసులో వాస్తవాలను వెలికితీయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంటోంది.కాగా ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై సీబీఐ తాజా చార్జిషీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చార్జిషీట్‌లో పలువురు ప్రస్తుత, పదవీవిరమణ చేసిన సీనియర్‌ అధికారుల పేర్లను సీబీఐ పొందుపరిచింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి