కెనడాలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం

0
92

టొరంటో : కెనడాలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. టొరంటోలో ఓ రెస్టారెంట్‌లో ఆకస్మాత్తుగా దుండగుడు జనంపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతొ ఒక్కసారిగా ఉలిక్కపడ్డ జనాలు పరుగుల తీశారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది నిందితుడిని మట్టుబెట్టారు.  ఈ ఘటనలో 13 మంది గాయపడగా ఓ మహిళ మృతి చెందిందని టొరంటో పోలీసులు ప్రకటించారు. వీరిలో ఓ 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు.

ఫేమస్‌ రెస్టారెంట్‌ అయిన టొరంటో ఈట్స్‌ రెస్టారెంట్‌లో రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొ‍న్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన దుండగుడు విచక్షణా రహితంగా 25  రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి