53 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో భారత్‌కి పసిడి

0
177


భారత బ్యాడ్మింటన్‌లో మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌‌లో యవ షట్లర్ లక్ష్యసేన్ స్వర్ణం‌తో భారత అభిమానుల్ని మురిపించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు ఈ టైటిల్‌ను 1965లో గౌతమ్ థక్కర్‌, 2012లో పీవీ సింధు మాత్రమే సాధించారు. తాజాగా ఈ ఘనత అందుకున్న లక్ష్యసేన్ 53 ఏళ్ల మళ్లీ ఆసియా జూనియర్‌ పురుషుల సింగిల్స్ గెలిచిన భారత షట్లర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

ఉత్తరాఖండ్‌కి చెందని 16 ఏళ్ల లక్ష్యసేన్‌‌ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ జూనియర్ నెం.1 ర్యాంక్‌లో ఉన్న థాయ్‌లాండ్ షట్లర్ కులావత్‌‌ వితిసన్‌తో ఢీకొన్నాడు. అయినప్పటికీ.. ఇటీవల కాలంలో సంచలన ఆటకి మారుపేరుగా మారిన లక్ష్యసేన్ 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో అతడ్ని మట్టి కరిపించాడు. రెండు సెట్లలోనూ గట్టి పోటీనిచ్చిన కులావత్.. ఆఖర్లో లక్ష్యసేన్‌ జోరు ముందు నిలవలేకపోయాడు. సుదీర్ఘకాలం తర్వాత భారత్‌కి టైటిల్‌ను అందించిన లక్ష్యసేన్‌కు భారత్ బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి