నాగార్జున ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే:సమంత

0
195

గ్లామర్ తో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోన్న టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత….వరుస హిట్ లతో దూసుకుపోతోంది. రాజుగారి గది-2లో కీలకమైన పాత్ర పోషించిన సమంత…..రంగస్థలం – మహానటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. యూటర్న్ తో సెప్టెంబర్ 13న సమంత మరోసారి ప్రేక్షకుల మందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన యూటర్న్ `ఫస్ట్ లుక్` పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో సమంత  షేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులతో సమంత చాట్ ఆసక్తికరంగా సాగింది.ఇప్పటివరకు నాగార్జున తనకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏమిటని అభిమాని అడిగిన ప్రశ్నకు…సామ్ ఆసక్తికర సమాధానమిచ్చింది. తమ ప్రేమను అంగీకరించడమే మామ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని సామ్ ట్వీట్ చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి