అవన్నీ స్పైసీ హెడ్లైన్స్.. అంతే: నిహారిక

0
148

ఈ ప్రపంచంలో అందమే కాదు చాలా ఆనందం కూడా ఉంటుంది.. ఎలా ఆనందించాలన్న విషయం తెలియడమే అన్నిటికన్నా ముఖ్యం.  కొంతమంది సాయంత్రమైతే నాలుగు గుక్కలు బిగించి ఉత్సాహం ప్రకటిస్తారు.. మరి కొందరు జబర్దస్త్ అంటారు.. కొందరేమో అమెరికా లో కాల్పుల నుండి అరకులో జరిగిన క్రైమ్ న్యూస్ వరకూ అంతా టీవీలో చూస్తూ తీరిగ్గా స్నాక్స్ తింటూ ‘ఆనందిస్తారు’.  న్యూ జనరేషన్ జనాలు కొంతమంది మాత్రం యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోస్ మీద దృష్టి పెడతారు.  అవి స్పైసీ టైటిల్స్ తో షాలిబండలోని షా ఘౌస్ హోటల్ లో ఉండే ఘాటు హైదరాబాది బిర్యానీ తిన్నట్టు

అయితే ఈ యుట్యుబ్ వీడియోస్ టైటిల్స్ ఎలా ఉంటాయో.. లోపల ఏముంటుందో అందరికీ తెలుసు.  కొన్ని సెలబ్రిటీలను నొప్పిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొంతమంది సెలబ్రిటీలు ఇప్పటికే అభ్యంతరం చెప్పారు కూడా.  ఈమధ్య ఇదే టాపిక్ గురించి మెగా హీరోయిన్ నిహారికకు ప్రశ్నలు ఎదురయ్యాయి.  అంటే.. స్పైసీ టైటిల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? (5 మార్కులు).. యుట్యూబ్ వీడియోల వలన సభ్య సమాజానికి వచ్చే అదనపు ఆదాయం ఏంటి?(10 మార్కులు) అనే క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు.  ఆ వీడియోల్లో ట్రెండింగ్ అవుతున్న రూమర్లన్నిటి మీద ప్రశ్నలు అడిగారు.  అసలే మెగా డాటర్..  నిహారిక ఒక్క ముక్కలో అన్నింటినీ తీసిపారేసింది..  అవి ‘స్పైసీ హెడ్లైన్స్’ అని.

పెళ్లిపై ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయని.. రేపు నిజంగా పెళ్లి న్యూస్ వస్తే పెద్దగా హైప్ ఉండదంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమెకు ఈ ప్రశ్నలెక్కడ ఎదురయ్యాయని మీకు అనుమానం వచ్చిందా? నిహారిక ప్రస్తుతం ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాలో నటిస్తోంది.  సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరో.  ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆ ప్రశ్నలన్నీ తనకు ఎదురయ్యాయి. మ్యాటర్ మొత్తం అయింది కానీ సంబంధం లేని విషయం కూడా ఒకటి మిగిలిపోయింది.   స్పైసీ హెడ్లైన్స్ ని తెలుగు లో ఏమంటారు?  ‘సుగంధ ద్రవ్య శీర్షికలు’..!

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి